సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం

సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం
_యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు
అనకాపల్లి: సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తారని, అంకితభావం, దృఢ సంకల్పంతో అనేక ఒత్తుడులను ఎదుర్కొని ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు అన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ (యూజెఎఫ్) అధ్యక్షులు ఎం.ఆర్. ఎం వర్మ సారధ్యంలో రూపొందించిన డైరీ, పాకెట్ బుక్ ను శుక్రవారం ఎస్పీ కార్యాలయ ఆవరణంలో అడిషనల్ ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమస్యలపై యూజేఎఫ్ చేస్తున్న కృషి అద్భుతమని అన్నారు. జర్నలిస్టులు కేవలం వార్తలకే పరిమితం కాకుండా ప్రశ్నించలేని ప్రజల పక్షాన వార్తా కథనాల ద్వారా నిలబడుతున్న యూజెఎఫ్ ప్రతినిధులను అభినందించారు. యూజేఎఫ్ విశాఖ యూనిట్ అధ్యక్షులు, ఏపియుడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్షులు కే. రాము మాట్లాడుతూ యూజేఎఫ్ అధ్యక్షులు డాక్టర్. ఎం.ఆర్. ఎన్. వర్మ సామాజిక స్పృహతో దశాబ్ద కాలానికి పైగా నిర్వహించిన కార్యక్రమాలు వివరించారు.
కార్యక్రమంలో యూజేఎఫ్ సమన్వయకర్త డి.హరనాథ్, అనకాపల్లి జిల్లా జర్నలిస్టులు భీమరశెట్టి వెంకటేష్ , షేక్ షాంద్ భాష, కాండ్రేగుల మోహన్ బాబు, పైలా రామారావు, బయ్యా కొండలరావు, ఈ షణ్ముఖ, మోల్లేటి గంగాధర్, గంటా శ్రీనివాసరావు, పొలిమేర నాగ శ్రీను,
కోరుబిల్లి గణేష్, సింగర్ రాజు, బోని గణేష్, వై. నాగు, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *