జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్ డిమాండ్
సూర్యాపేట (01 జూన్, 2025 ఆదివారం) ధర్మఘంట: యాదవులకు చట్టసభలలో 16 శాతం వాటా దక్కాలని
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్ డిమాండ్ చేశారు. నేడు సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల రోడ్డు మహర్షి డిగ్రీ కళాశాలలో తగుళ్ళ జనార్ధన్ యాదవ్ అధ్యక్షతన జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆదేశానుసారం జిల్లా నూతన కమిటీ నియమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ యాదవులకు చట్టసభలలో 16 శాతం వాటా దక్కాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో యాదవులు అధిక సంఖ్యలో ఉంటూ, ప్రకృతి ఒడిలో ప్రతి పంటను పండిస్తూ, జంతువులను సాదుతూ, ఈ దేశానికి అన్నం పెడుతున్న యాదవులను చట్టసభలలో పెద్ద పార్టీలన్నీ రాజకీయంగా మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఒక యాదవ ఎమ్మెల్యేకు మంత్రి పదవిచ్చి, రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఆదికులను యాదవులనే తీసుకోవాలని, మరియు ప్రతి నియామకంలో యాదవులకు అధిక శాతం పదవులు ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని లేనియెడల యాదవుల ఓటు బ్యాంకును కోల్పోయి ఆయాపార్టీల ఉనికికి భంగం కలుగుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జటంగి వెంకట నరసయ్య యాదవ్ ఆధ్వర్యంలో నియామకం జరిగింది.
నూతన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న యాదవ్, ఉపాధ్యక్షులు కోడి సత్యనారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆరాల రమేష్ యాదవ్, కార్యదర్శి కమ్మాల లింగయ్య యాదవ్, కోశాధికారి దూబాని మల్లేష్, సలహాదారులు మన్నే యాదగిరి యాదవ్, కోడి శివ యాదవ్,
సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు సుంకరబోయిన సతీష్ యాదవ్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు గోండ్ర హరీష్ యాదవ్, ఉపాధ్యక్షులు గడ్డం శివ యాదవ్, ప్రధాన కార్యదర్శి గజ్జి గోపి యాదవ్,
తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు భయ్యా ఉపేందర్ యాదవ్, ఉపాధ్యక్షులు పగిడి ఉపేందర్ యాదవ్, మండల అధ్యక్షులు బొల్లం ప్రభాకర్ యాదవ్ లను నియమించారు.
ఉప్పల మధుసూదన్ యాదవ్, బోల్లక గణేష్ యాదవ్, గోర్ల అంజయ్య యాదవ్, నల్లబోతు అనిల్ యాదవ్, కోడి మల్లేష్ యాదవ్, అల్లంల శ్రీనివాస్ యాదవ్, గజ్జి నాగరాజ్ యాదవ్, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.