
హైదరాబాదు నుండి అమరావతి వరకు. ఫిబ్రవరి 1 నుండి 3 తేదీ వరకు.
మానవాళి కి ఆలోచనను విస్తృతపరిచింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది కూడా పుస్తకమే.
సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి యాత్ర ప్రారంభించబడింది.
బస్సు యాత్రను ప్రారంభించిన గ్రంధాలయ చైర్మన్ రియాజ్.
ధర్మఘంట ఫిబ్రవరి 01. హైద్రాబాద్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ చిన్నతనం నుండే పుస్తకాలు చదివే ఆలోచన పిల్లల్లో రేకెత్తించాలన్నారు యువతరానికి పటనా శక్తిని పెంపొందించడానికి పుస్తకాలు చదవడం నిత్యజీవితంలో భాగంగా చేయాలి అన్నారు
పిల్లలకు తమలోని సృజనాత్మకత శక్తులను తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. సెల్ఫోన్ ఇంటర్నెట్ పిల్లలను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు సోషల్ మీడియా పోర్న్గ్రఫీ డ్రగ్స్ యువతకు శక్తిహీనులుగా మారుస్తున్నాయి ఇళ్లలోనూ విద్యాలయాలలోనూ గ్రంధాలయాలు అందుబాటులో లేకపోవడం వల్ల జీవితాలను ప్రభావితం చేసే పుస్తకాలు గురించి పిల్లలు తెలుసుకునే అవకాశం లేదు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ జాన్ బాషా. యాత్రకు రూపకల్పన చేసిన కస్తూరి ప్రభాకర్. కవి యాకుబ్. బండారు విజయ. కాసుల రవికుమార్. సిఏ ప్రసాద్. మంచి కంటి. పుస్తక ప్రేమికులు పాల్గొన్నారు.


Nice article..