ప్రజా విజయమే తెలంగాణ కల సాకార స్వప్నం

  • కడారి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఎడుటోరియల్ జర్నలిస్టు అవార్డు గ్రహీత

హైదరాబాద్ (01, జూన్ -2025) ధర్మఘంట: తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల పురిటి గడ్డ. ఈ రాష్ట్రం బానిస సంకెళ్లు తెంచుకుని బంధనాలు విముక్తి చేసుకుని స్వేచ్ఛ స్వాతంత్రంలోకి అడుగుపెట్టిన రోజు జూన్ 2. తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పాటై నేటికీ 11 సంవత్సరాలు దాటిపోతున్న ఈ శుభ సందర్భంగా ఆనాటి పోరాటాల చరిత్రను మనం గుర్తు చేసుకోవాల్సిందే… ఎన్నో పాటలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ఆత్మ బలిదానాలు తెలంగాణ రాష్ట్ర సాధనను నిజం చేశాయి. ఒకరా ఇద్దరా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంది. మాటల్లో వర్ణించలేను… ఉద్యమంలో ముందు వరుసలు రబ్బరు బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడింది ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థి లోకం కదం తొక్కింది… స్వరాష్ట్రం కోసం ప్రతి ఒక్క సంఘం ముందుకు నడిచేయి రాష్ట్ర సాధనలో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందు నడిచి రాష్ట్రం కోసం అహర్నిశలు ప్రజలు అనేక సమ్మెలు చేసి రాష్ట్ర కలను సాకారం చేసుకున్న రోజు… ఒకసారి జూన్ 2 వచ్చిందంటేనే గుండెలో ఏదో తెలియని సంతోషం.. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నేను ఒక జర్నలిస్టుగా పాత్ర వహించాను అంటే అది మరచిపోలేని రోజులు.. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు కార్యక్రమంలో ముషీరాబాద్ చౌరస్తాలో నా కుటుంబంతో నేను మొట్టమొదలు వంటవరకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.. ఇది చరిత్రలో మరువలేని రోజు…తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే నా కలంతో ఆత్మ బలిదానాలతో సాధించేదేముంది బతికి పొట్లాడి పోరాడి సాధించుకుందాం అంటూ సంధించిన నా అక్షరాలు ఇవ్వాలని నన్ను ప్రశ్నిస్తున్నాయి…

రాష్ట్రం సాధించుకొని 11 ఏళ్లు దాటుతున్న ముఖ్యమంత్రి మారుతున్నారే గాని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంక్షేమం కొంతవరకు అందిన ఉద్యోగాలు కొంతవరకు దొరికిన ఇంకా సంక్షేమం అభివృద్ధి మెరుగుపడాల్సిన అవసరం ఉంది.. తెలంగాణ ప్రభుత్వం నిత్యం పోరాట బిడ్డలకు జన్మనిస్తూనే ఉంది. రాష్ట్రం సాధించుకున్న సంతోషం మరవకముందే ఇంకా ఏదో సాధించాలి ఇంకా సంక్షేమం అభివృద్ధి మెరుగుపడాలి అన్న ఆలోచనలతో నా కలం గలాన్ని విప్పుతుంది.. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటూ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రజా పాలకులకు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సంకల్పంతో ఏర్పడిన రాష్ట్రం లో నివసిస్తున్న ప్రజలందరికీ ఆ సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ మొట్టమొదలు ‘ధర్మఘంట‘ జాతీయ దినపత్రిక నాకు అవకాశం కల్పించినందుకు పత్రిక యాజమాన్యానికి శిరస్సు వంచి నా అక్షరమాలను అందిస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *