పోలీసుల నిర్బంధ మరణంలో కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి


__డి.బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్

ధర్మఘంట, మార్చి 05, హైదరాబాద్ : ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట డి.బి.ఎస్.ఏ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది. పోలీసుల నిర్బంధంలో మరణించిన కర్ల రాజేష్ కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్ మాట్లాడుతూ, కర్ల రాజేష్ మరణానికి కారణమైన పోలీసు అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి అదుపులోకి తీసుకోవాలని అన్నారు. ఘటనపై న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర న్యాయ విచారణ ఏర్పాటు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సంపూర్ణ బాధ్యత వహించి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించి, ఒక కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే నిర్బంధ మరణాల నివారణ కోసం ప్రత్యేక చట్టబద్ధ పర్యవేక్షణ మండలి ఏర్పాటు చేయాలని, పోలీసు స్టేషన్లలో చిత్రదర్శిని పరికరాలను పారదర్శకంగా అమలు చేసి ప్రజా పర్యవేక్షణకు అవకాశం కల్పించాలని సూచించారు. దళితులపై జరుగుతున్న అణచివేతలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.“ఒక నిరపరాధి ప్రాణం పోవడం కేవలం ఒక కుటుంబ నష్టం కాదు అది సమాజానికి జరిగిన అన్యాయం. రాజేష్‌కు న్యాయం జరగాలంటే చట్టం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. బాధ్యులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించబడాలి” అని స్పష్టం చేశారు.కర్ల రాజేష్ కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు మోగిలిపాక నవీన్,మరియు ఓయూ స్కాలర్ నిషాంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *