అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల లోపు అమలు చేయాలి.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళిత గిరిజన ఆదివాసి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించు కొనుటకు 25 లక్షల రూపాయలను అందించాలి.

గత ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారులకు బ్యాంకులో జమ చేసిన, ఫ్రీజింగ్ లో ఉన్న డబ్బులను లబ్ధిదారులకు వెంటనే అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి.

హైదరాబాద్: అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల లోపు అమలు చేయాలని భారత ఎరుకల కులవృత్తుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు అంబేద్కర్ అభయ హస్తం సాధనకోసం చేవెళ్ల SC ST డిక్లరేషన్ పై మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్ని అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల లోపు అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన ఆదివాసి ప్రజలను ఏకం చేసి పోరాటానికి సిద్దం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో దళిత గిరిజన ఆదివాసి జెఏసి నాయకులు, మహా ఎమ్మార్పిస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యపాగ నర్సింగ్ రావ్, TMRPS రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు జన్ను కనుకరాజ్, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ వనం సుధాకర్, ఎరుకుల సంఘం నాయకులు వనం గంగయ్య, భజన పురం రఘు జగన్నాథం గంగాధర్ కేదారి అంజయ్య జగన్నాథం శ్రీను గాయకుడు డాక్టర్ రాజా రామన్న తెలంగాణ ప్రైవేటు ఉద్యోగస్తుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ, SC,ST ఐక్యవేదిక ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ముంజగల్ల విజయ్ కుమార్ అరుంధతీయ బందుసేవ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవ్వాజి వెంకటేశ్వర ప్రసాద్, మాదిగ శక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినపాటి రజని, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కళ్లేపెళ్లి రవి, పెర్క రాజమల్లు, తెలంగాణ ఉద్యమ కారుల సంఘం అధ్యక్షులు ఉప్పులేటి రాజేందర్, టాస్ రాష్ట్ర అధ్యక్షులు బొర్గి సంజీవ్, తెలంగాణ రాష్ట్ర జై భీమ్ సేవా సంఘం జనరల్ సెక్రటరీ బేతి విజయ్ కుమార్, జై భీమ్ మహసేన రాష్ట్ర అధ్యక్షులు మంచింటి అంజన్న, తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల కరుణాకర్, మాడగాని లింగయ్య, శారద, భాగ్యమ్మ, తరుణ్, వనం సుందర్,వనం గంగయ్య, గంగాధర్, వీరన్న, అంజయ్య, జగన్నాథం, శ్రీను తదితరులు పాల్గొని చేవెళ్ల SC ST డిక్లరేషన్ లో ప్రకటించిన 12 అంశాలను వెంటనే అమలు పరచి దళిత గిరిజన ఆదివాసి కుటుంబాల అభివృద్ధికి బాటలు వేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలను చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *