Operation Sindoor: చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది భారత్. పాకిస్థాన్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తమను రెచ్చగొడుతున్న డ్రాగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా. అసలేం జరిగిందంటే..
చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఆపరేషన్ సిందూర్ మీద తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న డ్రాగన్ కంట్రీకి సంబంధించిన న్యూస్ ఏజెన్సీలను ట్విట్టర్లో బ్లాక్ చేసింది. చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ అనే ఆంగ్ల పత్రికతో పాటు ఆ దేశ అధికార న్యూస్ ఏజెన్సీ జిన్హువా ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేసింది మోదీ సర్కారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం, ధృవీకరించకుండానే సమాచారాన్ని వ్యాప్తి చేయడం విషయంలో చైనాపై ఇప్పటికే అక్కడి భారత ఎంబసీ మండిపడింది. ఆపరేషన్ సిందూర్ మీద కొన్ని పాకిస్థాన్ అనుకూల వర్గాలు నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. అలాంటి సమాచారాన్ని వెరిఫై చేయకుండా వ్యాప్తి చేయడం సరికాదని, ఇది బాధ్యతాయుతమైన పాత్రికేయం అనిపించుకోదంటూ చైనీస్ మీడియాను దుయ్యబట్టింది.
భారత ఎంబసీ కోరినా..
ఆపరేషన్ సిందూర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దంటూ చైనాలోని భారత ఎంబసీ కోరినా ఏ మార్పు రాలేదు. డ్రాగన్ కంట్రీకి చెందిన న్యూస్ ఏజెన్సీలు ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడంతో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్‌తో పాటు జిన్హువా న్యూస్ ఏజెన్సీని ట్విట్టర్లో బ్లాక్ చేసేసింది.