నగరంలో.. కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాలకు వెళ్లేవారే లక్ష్యంగా.. ఈ అక్రమ దందాకు తెరలేపారు. విదేశాలకు వెళ్లే వారికి నకిలీ ధ్రువపత్రాలు జారీచేసి వారినుంచి భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. అయితే.. ఏది ఎంతకాలం ఆగదుగా.. పాపం పండింది. మొత్తం ఈ అక్రమాల దందా మొత్తం బయటకు వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.
– ‘నకిలీ’ ముఠా అరెస్ట్
– విదేశాలకు వెళ్లేవారే లక్ష్యంగా దందా
– రూ.2లక్షల నుంచి 4 లక్షలకు విక్రయం
– నలుగురు నిందితుల అరెస్టు
-108 నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: విదేశాలకు వెళ్లేవారే లక్ష్యంగా.. నగరంలో నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ముఠాను సౌత్ ఈస్టు జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 108 నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ ముజీబ్ హుస్సేన్ మెహిదీపట్నంలో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు.