సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఆన్లైన్లో మెడిసిన్ కోసం వెదికుతున్న వ్యక్త నుంచి రూ.2.25 లక్షలు కొట్టేశారు. ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలో సైబర్ మోసానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఈ తరహ మోసాలపై ప్రజల్లో ఒకింత అవగాహన తక్కువగా ఉండటంతో ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు.
– సైబర్ నేరగాళ్లకు చిక్కిన విద్యార్థి
హైదరాబాద్ సిటీ: ఔషధాల కోసం ఆన్లైన్లో వెదికి సైబర్ నేరగాళ్ల(Cyber criminals) మోసానికి ఓ విద్యార్థి గురయ్యాడు. రూ.2.25 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్‌క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థి ఈనెల 4న ఓ మెడిసిన్ కోసం గూగుల్(Google)లో వెదికాడు. ఆ మెడిసిన్ ధర యూనిట్‌కు దాదాపు రూ.5000గా ఉంది. హోల్‌సేల్ దుకాణాల్లో అయితే ధర తగ్గుతుందని వాటి కోసం వెదుకుతుండగా కొన్ని ఫోన్ కాల్స్ చేశాడు. ఆ ఔషధాన్ని హోల్‌సేల్ ధరకు అమ్ముతామని ఓ వ్యక్తి మాట్లాడాడు.