ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకి కూడా మతిపోగొట్టిన ‘జయసుధ’ చేసిన తొలి యాడ్‌

సహజనటి జయసుధ కెరీర్‌ బిగినింగ్‌లో ఓ యాడ్‌ చేసింది. అది తన ఫస్ట్ యాడ్‌. అది కూడా లుంగీ యాడ్‌ కావడం విశేషం. దీనికి సంబంధించిన ఒక అరుదైన ఫోటో ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా పేరుతెచ్చుకుంది జయసుధ. దాదాపు ఐదు దశాబ్దాలుగా నటిగా రాణిస్తుంది. లెజెండరీ నటి, దర్శకురాలు విజయ నిర్మల రిలేటివ్‌ కావడంతో ఆమె ద్వారా జయసుధకి సినిమా అవకాశాలు వచ్చాయి. 

విజయ నిర్మల సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి జయసుధ

తొలిసారి ఆమె కృష్ణ సరసన హీరోయిన్‌గా నటించింది. 13ఏళ్ల వయసులోనే కృష్ణతో `పండంటి కాపురం` చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అనతి కాలంలోనే స్టార్‌ అయిపోయిన జయసుధ

అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది జయసుధ. అప్పట్లో హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉండేవారు. దీంతో ఉన్న వారినే అందరి హీరోల సినిమాల్లో రిపీట్‌ చేసేవాళ్లు. అలా జయసుధ ఏడాది తిరగకుండానే స్టార్ అయిపోయింది. ఆమెకి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. పైగా కృష్ణ లాంటి పెద్ద స్టార్‌ ఫ్యామిలీ సపోర్ట్ ఉండటంతో జయసుధ కెరీర్‌ పరుగులు పెట్టిందని చెప్పొచ్చు.

ఫస్ట్ టైమ్‌ కమర్షియల్‌ యాడ్‌ చేసిన జయసుధ

అయితే ఆ సమయంలో కమర్షియల్‌ యాడ్స్ చేయడం ఒక వింత. సావిత్రి వంటి కొందరు నటీమణులు అడపాదడపా ఒకటి అర యాడ్స్ లో నటించారు. ఈ క్రమంలో జయసుధ కూడా ఓ యాడ్‌ చేసింది. అయితే అదేదో అందానికి సంబంధించిన యాడ్‌ కాదు, లుంగీ యాడ్‌ కావడం విశేషం. 

లుంగీ యాడ్‌లో జయసుధ, అప్పట్లో రచ్చ

లుంగీ యాడ్‌ హీరోయిన్లు చేయడం అప్పట్లో పెద్ద వింత. అప్పుడే కాదు, ఇది ఇప్పుడు చూసినా వింతే. ఫస్ట్ ఇలా ఒక లుంగీ యాడ్‌ హీరోయిన్ చేయడంతో చూసిన ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకి కూడా మతిపోయిందట. అదేఈ యాడ్‌ ప్రత్యేకత కావడం, క్రేజ్‌కి కారణం కావడం విశేషం.

ఆడవాళ్లు కూడా లుంగీ కట్టుకోవడం విశేషం

జయసుధ 1973లో లుంగీ యాడ్‌ చేయడం విశేషం. అప్పట్లో ఫేమస్‌ అయిన శంఖు మార్కు లుంగీ యాడ్స్ చేయడం విశేషం. అప్పట్లో ఇదొక బ్రాండ్‌. బాగా ఉన్నవాళ్లు మాత్రమే ఈ లుంగీలు కట్టుకునేవాళ్లు. సాధారణ లుంగీల కంటే వీటి రేట్‌ ఐదు నుంచి, పది రెట్లు ఎక్కువగా ఉండేదట. బ్రాండ్‌ ని ఇష్టపడేవారు మాత్రమే ఈ లుంగీలను కట్టేవారు.

అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఈ లుంగీ యాడ్‌ హీరోలు కాకుండా హీరోయిన్ అయిన జయసుధ చేయడమే. అయితే ఈ లుంగీలను ఆడవాళ్లు కూడా కట్టుకునేవారట. అలా వారికి కూడా కంఫర్ట్ గా ఉండేవిధంగా ఈ లుంగీలను తయారు చేసేవారట. 

అప్పట్లో ఆడవాళ్లు కూడా ఈ లుంగీలను పోటీ పడి కొనుక్కునేవారట. అందుకే అప్పుడు హీరోయిన్లలో యంగ్‌ సెన్సేషన్‌గా నిలిచిన జయసుధతో ఈ యాడ్‌ చేయించారట. 1973లో చేసిన ఈ అరుదైన యాడ్‌ క్లిప్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

జయసుధ చేసిన శంఖు మార్కు లుంగీ యాడ్‌

ఈ యాడ్‌ని పరిశీలిస్తే ఇందులో `ఆడవాళ్లను, మగవాళ్లను, అందరినెంతో ఆకర్షించే శంఖు మార్కు లుంగీలు` అని ఉంది. లుంగీలు, చేతిగుడ్డలు తయారు చేసేవారు. దీన్ని మద్రాస్‌(నేటి చెన్నై)కి చెందిన మొహమదు అబూబకర్‌ అండ్‌ కంపెనీ తయారు చేసేది. 

శంఖు సింబల్‌తో ఉన్న ఈ లుంగీ యాడ్‌ లో జయసుధ ఎంతో అందంగా ఉంది. క్యూట్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత జయసుధ పెద్ద స్టార్‌ అయిపోయింది. అనేక కమర్షియల్‌ యాడ్స్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా యాడ్స్ లో కనిపిస్తుంది జయసుధ.

సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న జయసుధ

ఇక జయసుధ చివరగా `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించింది. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. తన పాత్రకు ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేస్తుంది. అదే సమయంలో మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలకే ప్రయారిటీ ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *