విద్యార్థి దశలో ఇంటర్ విద్య ముఖ్యం
–ఎంజీయూ టీపీడీఎంఏ అధ్యక్షులు తీకుళ్ల శ్రీనివాస్ రెడ్డి
ధర్మఘంట పిబ్రవరి 1,సూర్యాపేట: విద్యార్థులు విద్యలో రాణించడంతోపాటు విలువలను పెంపొందించుకోవాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం సంఘం అధ్యక్షులు తీకుళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాయిగౌతమి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సాయి గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని నైపుణ్యాలను, విలువలను నేర్పిస్తున్నట్లు తెలిపారు.కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఇంటర్ విద్యలో సాయి గౌతమి కళాశాల ముందంజలో ఉందని అన్నారు.పేద విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇవ్వడంతో పాటు ఉన్నతంగా రాణిస్తున్న విద్యార్థులకు చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థులకు నేర్చుకోవాలనే తపన ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో టాప్ కాలేజీ అయినా స్పందన డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు ప్లేస్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.అంతకుముందు గ్రూప్ వన్ ఆఫీసర్,ఆ కళాశాల పూర్వ విద్యార్థి నరేష్ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యరగాని లక్ష్మయ్య గౌడ్, కరస్పాండెంట్ భగవాన్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ తీకుళ్ల సోమిరెడ్డి, శేరి శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


