
మీ దేహాలమీది బట్టలు ఉతికి
మైల తీయకలిగాం కానీ..మీ బుర్రలో పుట్టిన కులం మైలను కడుగలేక పోయాం..!
చీ అన్నా.. థూ అన్నా.. తుడుచుకొని పోయింది..!
చాకలోడ..చాకలిదాన అంటూ తిట్టినా.. కొట్టినా.. గీ పొరగాండ్ల కోసమే బాంచెన్.
ఇగ గీ బిడ్డలే లేనప్పుడు..?
గా దేవుడెందుకు..? మీరెందుకు..?
మీ పాలనెందుకు…?చెల్
బంచేత్..ఎట్లయితే అట్లయ్యే..! చూసుకుందాం..!చూసుకుందాం..!!
(నాగర్ కర్నూల్ జిల్లాలో పసిపాప కులోన్మాద హత్యకు నిరసనగా)
– బద్రి కంచర్ల
ఉస్మానియా యూనివర్సిటీ
