ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 3 పతకాలు…
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 3 పతకాలు లభించాయి. మంగళవారం బిహార్‌లో జరిగిన ఈ పోటీల్లోని ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ జూనియర్ ఆల్‌రౌండ్ విభాగంలో నిషిక (హైదరాబాద్) 44.333 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. వెయిట్‌లిఫ్టింగ్ యూత్ బాలుర 89 కిలోల విభాగంలో సాయివర్దన్ (సికింద్రాబాద్) 275 కిలోల బరువెత్తి స్వర్ణం సాధించగా, చెంచు వెంకటేష్ (గుంటూరు) 272 కిలోల బరువెత్తి రజతంతో సరిపెట్టుకున్నాడు. బాలికల ఫెన్సింగ్ ఈపీ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి అదీబా హురైన్ కాంస్యంతో మెరిసింది. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో చరణ్ రామ్, హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్) ద్వయం కైవసం చేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్ యూత్ బాలికల 64 కి., కేటగిరీలో జి.వర్షిత (శ్రీకాకుళం) 174 కిలోల బరువెత్తి పసిడితో మెరిసింది.