కేంద్ర ప్రభుత్వం మహిళకు అతి తక్కువ వడ్డీకి అందిస్తున్న రూ. 5 లక్షల రుణం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాభార్డు బ్యాంకు (నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మహిళల అభివృద్ధి కోసం అనేక ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టింది.

ముఖ్యంగా మహిళలను స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు రుణస్కీములను ప్రవేశపెట్టింది. అలాంటి స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహిళలు ముఖ్యంగా బిపిఎల్ కుటుంబాలకు చెందిన వారు, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వారిని ప్రోత్సహించేందుకు నాబార్డ్ బ్యాంకు ఈ స్కీం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళలు 10-20 మంది ఒక బృందంగా ఏర్పడి ఒక స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రుణం పొందవచ్చు. నాబార్డ్ బ్యాంకు అందిస్తున్న ఈ స్కీం ప్రకారం దాదాపు 5 లక్షల రూపాయల రుణాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రుణాన్ని ఉపయోగించుకొని మహిళలు చిరు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ పరిశ్రమలు, పశుపోషణ వంటి ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఈ రుణంపై సబ్సిడీలు కూడా అందుబాటులో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు సబ్సిడీని అందించే అవకాశం ఉంది.

ఇప్పుడు ఈ స్కీం గురించి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే విషయాలను ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం…

ఆర్థికంగా వెనుకబడిన తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు ఒక బృందంగా ఏర్పడి ఈ రుణం పొందవచ్చు.

నాబార్డ్ బ్యాంకు ద్వారా ఈ రుణం లభిస్తుంది. బ్యాంకు వీరికి రుణ సదుపాయం అందించడంతోపాటు, వారికి శిక్షణ కూడా కల్పిస్తుంది.

గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు రుణం పొందగలిగే అవకాశం ఉంది.

ఈ రుణాన్ని ఉపయోగించుకొని చిరు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, పరిశ్రమలు, పశుపోషణ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ రుణం అప్లై చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్ల విషయానికి వస్తే..ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్‌బుక్ (SHG పేరుమీద), షరతులను అంగీకరిస్తూ పత్రాలు, SHG సభ్యుల సంతకాలు అవసరం అవుతాయి.

ఈ రుణం కోసం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ జిల్లాలోని NABARD జిల్లా కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు.

ఈ రుణం వ్యక్తిగతంగా కాకుండా మీ SHG గ్రూపు పేరిట జారీ అవుతుంది.

ఉదాహరణకు మీరు టైలరింగ్ రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే, మీకు తెలిసిన 10 నుంచి 15 మంది ఒక గ్రూపుగా ఏర్పడి మీరు పొందవచ్చు. ప్రారంభంలో కనీస రుణం కింద 50 వేల రూపాయలు నుంచి రూ. 5 లక్షలు అందించే అవకాశం ఉంటుంది. ఇక ఈ బ్యాంకు రుణం వడ్డీ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. 3 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ రుణాన్ని 2-5 సంవత్సరాల కాల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *