అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.

ఫిబ్రవరి 17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్, ఫిబ్రవరి 02, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 న మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నందున వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఈ డిగ్రీ మూడవ, రెండవ, మొదటి సంవత్సరం వేర్వేరు సెమిస్టర్ల పరీక్షలను తిరిగి ఈ నెల 17 నుండి మార్చ్ 10, 2026 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. భోజు శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, పరీక్షకు మూడు రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రంలో, లేదా వెబ్ సైట్ www.braou.ac.in లో సంప్రదించొచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *