Category స్పోర్ట్స్

ముగిసిన ఐపీఎల్ 2025.. విజేతల జాబితా ఇదే…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులను అలరించింది. నిన్న రాత్రి న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్‌తో టోర్నీ ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందజేశారు. ఐపీఎల్‌లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా…

IPL 2025: 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఆర్‌సీబీ.. పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం!

.ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్‌ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ.. అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది.…

అభిషేక్ ధనాధన్ ఇన్నింగ్స్…. లక్నోను ఇంటికి పంపించిన హైదరాబాద్ సన్ రైజర్స్

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ నాలుగో విక్టరీ నమోదు చేసుకుంది. సోమవారం (మే 19) లక్నో సూపర్ జయింట్స్ పై సన్ రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఘణ విజయాన్ని అందుకుంది. ఛేజింగ్ లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో (59) పరుగుల మెరుపు ఇన్నింగ్స్…

ఒక్క దెబ్బకు మూడు బెర్తులు

ప్లేఆఫ్స్‌లో గుజరాత్, బెంగుళూరు, పంజాబ్ గుజరాత్‌ టైటాన్స్‌ ఒక్క దెబ్బతో మూడు బెర్తులు ఖాయం చేసింది. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 200 లక్ష్యాన్ని ఒక్క వికెట్టూ కోల్పోకుండా, ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించేసిన టైటాన్స్‌.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. నాలుగు జట్లకు మించి 17, అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో…

బట్లర్‌ స్థానంలో కుశాల్‌

ప్లేఆఫ్స్‌ రేసులో అందరికంటే ముందున్న గుజరాత్‌ టైటాన్స్‌కు స్టార్‌ ప్లేయర్‌ బట్లర్‌ దూరం కానున్నాడు. విండీస్‌తో సిరీస్‌ ఉండడంతో తను ఇంగ్లండ్‌ జట్టులో చేరనున్నాడు… ప్లేఆఫ్స్‌ రేసులో అందరికంటే ముందున్న గుజరాత్‌ టైటాన్స్‌కు స్టార్‌ ప్లేయర్‌ బట్లర్‌ దూరం కానున్నాడు. విండీస్‌తో సిరీస్‌ ఉండడంతో తను ఇంగ్లండ్‌ జట్టులో చేరనున్నాడు. దీంతో ఆ జట్టు చివరి…

ఖేలో ఇండియా లో తెలుగోళ్ల సత్తా

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 3 పతకాలు… హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 3 పతకాలు లభించాయి. మంగళవారం బిహార్‌లో జరిగిన…

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై అనుష్క రియాక్షన్.. కథ చెప్పాడంటూ..

Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నా.. అలవోకగా మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్‌మెంట్ ప్రకటనతో అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు విరాట్. ఈ విషయంపై తాజాగా అతడి సతీమణి అనుష్క శర్మ స్పందింది. ఆమె ఏం అందంటే.. టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు…