కోదాడ టౌన్ (ధర్మఘంట): గత ఐదు రోజులుగా పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల కోదాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగిసినది. శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి సలీం షరీఫ్ మాట్లాడుతూ మౌలిక భాష, గణిత సామర్ధ్యాల సాధనలో భాగంగా జరిగిన శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉన్నదని , ఈ శిక్షణలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని పాఠశాల స్థాయికి తీసుకువెళ్లి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్దికి తోడ్పడాలని ఆయన ఉద్బోధించారు. విద్యా బోధనలో, ప్రగతి సాధించడంలో జిల్లాలోనే ముందంజలో ఉంచాలని, శిక్షణను ఫలవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
శిక్షణ కార్యక్రమాన్ని డిఆర్పి గోదేషి దయాకర్ సందర్శించి సూచనలు, సలహాలు అందిస్తూ శిక్షణపై సంతృప్తిని వ్యక్తం చేశారు. శిక్షణలో ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు జీ.వి. కిరణ్మయి, పోకల వీరబాబు, SK. జబ్బార్, పెరుమాళ్ళ రామారావు మరియు రిసోర్స్ పర్సన్ లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ మార్కండేయ, ఖాజామియా, వేణు, మండల రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించిన కె. వేణుబాబు, బి.రామానాయక్, పి అంకులయ్య , సుమయ పర్వీన్, ఎండి అజీముద్దీన్, జి. రవిచందర్, ఏ.పద్మ , జి. స్రవంతి పాల్గొన్నారు.